గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు సమావేశం కానున్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
రైతు సంక్షేమం కోసం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలు, వైఫల్యాలపై చర్చిస్తారు. ప్రధానంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు వాటి వైఫల్యాలపై సమీక్ష నిర్వహించనున్నారు. 2018 డిసెంబరు నాటికి తీసుకున్న పంట రుణాల... రుణమాఫీ జరగకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి.
ఇవీ చూడండి: ప్రాణహాని ఉంది రక్షణ పెంచండి: ఎంపీ రేవంత్ రెడ్డి