ETV Bharat / state

బస్తీమే సవాల్: మున్సిపల్ పోరులో పీసీసీ రేస్ - మున్సిపాలిటీ ఎన్నికలకు కాంగ్రెస్​ నాయకుల కసరత్తు

టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకు పురపాలక ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. అధిక సంఖ్యలో మున్సిపాలిటీలు గెలిపించుకొని అధిష్ఠానం దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే…పురపాలక ఎన్నికలను సవాల్​గా తీసుకున్న హస్తం నేతలు... రాజధాని నుంచి తమకు అప్పగించిన నియోజకవర్గాలకు మకాం మార్చారు.  పార్టీ గెలుపు బావుటా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు.

CONGRESS LEADERS DOING HOMEWORK FOR MUNICIPAL ELECTIONS

author img

By

Published : Jan 8, 2020, 4:30 PM IST

Updated : Jan 10, 2020, 3:00 PM IST

మున్సిపల్ పోరులో పీసీసీ రేస్
రాష్ట్రంలో పురపాలక, నగరపాలక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అధిక స్థానాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేయాలని అధిష్ఠానం ఆదేశించగా... నాయకులంతా తలమునలయ్యారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. తమ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో అధిక స్థానాలు గెల్చుకుని అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. పురపోరులో అధిక స్థానాలు దక్కించుకోలేకపోతే పీసీసీ రేస్​లో వెనుకబడి పోతామన్న బెంగ కొందరిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.... తెరాస, భాజపాను ఎలా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేస్తున్నారు.

సత్తా చాటేందుకు నేతల కృషి...

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డికి మల్కాజిగిరి లోకసభ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థలతోపాటు కొడంగల్ పురపాలక సంఘం బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. అధిక స్థానాలు గెలిపించి తన సత్తా చాటేందుకు రేవంత్​రెడ్డి రాత్రిపగలూ కష్టపడుతున్నారు. భువనగిరి లోకసభ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల బాధ్యతలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తీసుకున్నారు. ఇప్పటికే ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. తమ పరిధిలో ఎక్కువ మున్సిపాలిటీలను గెలిపించి తన సత్తా చాటి... ఏఐసీసీలో పదవి పొందాలని ఉత్తమ్ ఆశిస్తున్నారు.

అధిక స్థానాల కైవసానికి వ్యూహాలు...

ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీలను గెలిపించుకునే బాధ్యత తీసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... అక్కడే మకాం వేశారు. విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థలను దక్కించుకోవడానికి మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు వ్యూహా రచన చేస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తీసుకొని గెలుపు జెండా ఎగరేసేందుకు కృషి చేస్తున్నారు.

పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నేతలంతా... అధిక స్థానాలు గెలిపించుకొని అధిష్ఠానం వద్ద సమర్థులమని నిరూపించుకోడానికి ఎవరికివారు పోటీపడుతుండటం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి నెలకొంది.

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన

Intro:Body:Conclusion:
Last Updated : Jan 10, 2020, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.