ETV Bharat / state

'కరోనా కట్టడికి దిక్కులేదు కానీ... కొత్త సచివాలయమా?' - సచివాలయం కూల్చివేత

సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్​ పార్టీ భగ్గుమన్నది. కరోనా విపత్కాలంలో ప్రజాధనాన్ని వృథా చేయడమేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రానికి నూతన పరిపాలనా కేంద్రం అవసరమా అంటూ నిలదీశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేలోపే ప్రభుత్వం భవనాలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.

congress-leaders-serious-on-trs-government
'కరోనా కట్టడికి దిక్కులేదు కానీ... కొత్త సచివాలయం కావాలంటా'
author img

By

Published : Jul 7, 2020, 7:17 PM IST

విభజన చట్టం ప్రకారం గవర్నర్ సెక్షన్-8 అమలు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి షబీర్ అలీలు డిమాండ్ చేశారు. గవర్నర్ పిలిస్తే వెళ్లకుండా... నిర్లక్ష్యం చేస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ రాజ్యాంగాన్ని అవమానపరిచారని తెలిపారు.

'కరోనా కట్టడికి దిక్కులేదు కానీ... కొత్త సచివాలయం కావాలంటా'

''గవర్నర్ పిలిస్తే వెళ్లకుండా సీఎస్ సోమేశ్ కుమార్ నిర్లక్ష్యాన్ని వహించారు. ఇది చాలా బాధాకరం. దొంగలాగా అర్థరాత్రి సచివాలయాన్ని కూల్చివేయడానికి వస్తారు కానీ... గవర్నర్ పిలిస్తే వెళ్లాడానికి మీకు పనులు అడ్డు వస్తున్నాయా?''

-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

'' విభజన చట్టం ప్రకారం సెక్షన్-8ను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గవర్నర్​ను కోరుతున్నాం. సచివాలయాన్ని కూల్చకుండా కరోనా చికిత్సకు వినియోగించాలని కోరితే... మా మాటలు పెడచెవిన పెట్టి కూల్చివేతలు ప్రారంభించారు. సీఎం ఇక్కడు ఉండరు కానీ... కూల్చివేత పనులను మాత్రం వెంటనే ప్రారంభిస్తారు.''

-మాజీ మంత్రి షబ్బీర్ అలీ

''గాంధీలో రోగులకు చికిత్స ఇవ్వడానికి... వైద్యుడు, నర్సులు రోగి వద్దకు చేరుకోవడానికి 10 గంటల సమయం పడుతుంది. డాక్టర్ల సంఖ్య తక్కువ ఉండి రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్లనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన చికిత్స అందక సంగారెడ్డి కౌన్సిలర్ గౌసియా బేగం మృతి చెందింది. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న నేను ఆమెకు చికిత్స అందించేందుకు ప్రయత్నించగా... ప్రభుత్వం సరైన సమయానికి చికిత్స ఇవ్వడంలో వైఫల్యం చెందింది.''

-ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గాంధీలో చికిత్స విషయంలో ప్రభుత్వం చెప్పేవి వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో... కరోనాను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.

ఇదీ చూడండి: కేసీఆర్ బయటికొచ్చి ప్రజలకు నిజాలు చెప్పాలి: సీఎల్పీ నేత భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.