ETV Bharat / state

'పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చు' - హైదరాబాద్ తాజా వార్తలు

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చని కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా పర్యటనకు రావద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడాన్ని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు.

Congress
టీకాంగ్రెస్
author img

By

Published : Apr 29, 2022, 10:34 PM IST

నల్గొండ జిల్లా పర్యటనకు రావద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్పడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించొచ్చని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతా బాగానే ఉంది.. అందరం కలిసే ఉన్నామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నితిన్ గడ్కరీ ప్రోగ్రాంకు కోమటిరెడ్డి హాజరయ్యారు. తాము పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థానిక నేతలకు సమాచారం ఇచ్చేవాళ్లమని తెలిపారు. రాహుల్ గాంధీ మీటింగ్​కి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో కార్యకర్తలు తరలి వస్తారని తెలియజేశారు.

"కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ ఏమీ మాట్లాడినా ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ నోటిసుకి పోతాయి. అన్ని విషయాలని వారు పరిశీలిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చు. ఎవ్వరూ ఎక్కడికి రాకూడదు అనే పరిస్థితి రావొద్దనేదే మా ఆలోచన." -మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఆ జిల్లాకు చెందిన షబ్బీర్‌ అలీ, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఖండించారు. రాష్ట్రంలోనే అత్యధిక జడ్పీటీసీ, ఎంపీటీసీలు గెలిచారని తెలిపారు. ఆ తరువాత తెరాస ప్రలోభాలకులోనై పార్టీ మారారని షబీర్‌ అలీ వివరించారు. పీసీసీ అధ్యక్షుడిని అడ్డుకుంటే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, దేశంలో రాహుల్, సోనియా గాంధీలు చెప్పిన మాట పార్టీలో అందరు విని తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి డుమ్మా

5-12 ఏళ్ల చిన్నారులకు కరోనా టీకాపై ట్విస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.