ప్రభుత్వానికి.. ప్రజా సమస్యలు వినే ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. సభల్లో ప్రభుత్వ తీరుకి నిరసనగా.. నేతలు హైదరాబాద్ గన్‌పార్కు వద్ద ఆందోళన చేపట్టారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. అసెంబ్లీ వరకూ ర్యాలీగా వెళ్లారు.
ప్రభుత్వం.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు యత్నిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. సాధారణ ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదన్నారు. మాట్లాడటానికి అవకాశం కల్పించాలని పలు మార్లు స్పీకర్‌ను కోరినా.. ప్రయోజనం లేదని ఆయన మండిపడ్డారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ రూ.27 లక్షలు వసూలు