ETV Bharat / state

దిల్లీలో హస్తం నేతల మకాం... ఆసక్తిరేపుతోన్న పీసీసీ ఎంపిక - Interesting PCC option

కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్ష ఎంపిక ఆసక్తి రేపుతోంది. పదవిని ఆశిస్తున్న ఆశావహులు ఒక్కొక్కరుగా దిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు దిల్లీలో ఉండగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు దిల్లీలో ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

దిల్లీలో హస్తం నేతల మకాం... ఆసక్తిరేపుతోన్న పీసీసీ ఎంపిక

author img

By

Published : Dec 16, 2020, 4:50 PM IST

పీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్‌ పార్టీలో ఉత్కంఠతకు తెరలేపింది. దిల్లీ కేంద్రంగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యనాయకులు... పదవిని ఆశిస్తున్న ఆశావహులు ఒక్కరొక్కరుగా దిల్లీ చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు దిల్లీలో ఉండగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు దిల్లీలో ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

ప్రయత్నాలు...

అధిష్ఠానం పిలుపుమేరకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మధ్యాహ్నం దిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడే ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్​గాంధీని కలిశారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసేందుకు కూడా ప్రయత్నించారు. డిఫెన్స్‌ పార్లమెంటరీ కమిటీ భేటీలో పాల్గొనేందుకు ఎంపీ రేవంత్‌ రెడ్డి... ఇవాళ ఉదయం దిల్లీ బయలుదేరి వెళ్లారు.

దిల్లీలో మకాం...

ఆ కమిటీలో రాహుల్‌ గాంధీ, రేవంత్​రెడ్డిలు ఇద్దరే అందులో సభ్యులు కావడం వల్ల రాహుల్​గాంధీని ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే కలిసే అవకాశం రావడం వల్ల పీసీసీ అధ్యక్ష ఎంపిక వారి మధ్యలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు దిల్లీలో మకాం వేసి తాజా రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నారు.

రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌... చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీకి చెందిన ఏఐసీసీ వద్ద చర్చకు వచ్చే అవకాశం తక్కువేనని చెబుతున్న కాంగ్రెస్‌ వర్గాలు... నెలాఖరు నాటికి తేలే అవకాశం ఉందని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.