ETV Bharat / state

Revanthreddy on rosaiah Dead: 'కాంగ్రెస్ సిద్ధాంతాలను నూటికినూరు శాతం నమ్మిన వ్యక్తి రోశయ్య'

Congress leaders on Rosaiah dead: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల పలువురు కాంగ్రెస్​ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నూటికినూరు శాతం నమ్మి చివరి క్షణం వరకు ప్రజాస్వామ్య విలువల కోసం కృషి చేసిన వ్యక్తి రోశయ్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మృతి తెలుగు రాజకీయల్లో తీరనిలోటని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తగా రోశయ్య వెలుగొందారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనియాడారు.

Congress leaders Mourns about rosaiah dead
Revanthreddy on rosaiah Dead
author img

By

Published : Dec 4, 2021, 2:48 PM IST

Updated : Dec 4, 2021, 7:33 PM IST

Congress leaders on Rosaiah dead: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల పలువురు కాంగ్రెస్​ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత క్రమశిక్షణ, సుధీర్ఘ రాజకీయ​ అనుభవం కలిగిన కాంగ్రెస్ కార్యకర్త రోశయ్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నూటికినూరు శాతం నమ్మి చివరి క్షణం వరకు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కృషి చేసిన వ్యక్తి రోశయ్య అని తెలిపారు. ఆయన మృతి తెలుగు రాజకీయల్లో తీరనిలోటని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన రేవంత్‌ రెడ్డి... ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తగా వెలుగొందారు..

రాష్ట్ర విభజన జరిగినా తన అంతిమ యాత్ర హైదరాబాద్‌లోనే జరుగుతుందని రోశయ్య చెప్పారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేసిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య లేని మంత్రివర్గం ఊహించలేదని తెలిపారు. వైఎస్ హయాంలో ఎన్ని పథకాలు అమలు చేసినా ఓవర్ డ్రాప్‌కు వెళ్లలేదని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన జీవన్ రెడ్డి...ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.

అధికారగర్వం లేని వ్యక్తి...

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ,‌ మంత్రి, సీఎం, గవర్నర్​ లాంటి ఎన్నో పదవులు చేపట్టిన రోశయ్య గర్వంలేని వ్యక్తిగా గుర్తింపుపొందరాని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి అన్నారు. అసెంబ్లీలో ఎంతో హుందాతనంతో వ్యవహరించే వారని అన్నారు. అసెంబ్లీలో అర్ధవంతంగా మాట్లాడేవారని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... కౌన్సిల్​లో రోశయ్య నిత్యవసర ధరలపై మాట్లాడగా... రోశయ్యను ఎదుర్కోవడం చాలా కష్టమని మండలినే రద్దు చేసే ఆలోచన ఎన్టీఆర్​కు వచ్చిందని మల్లురవి అన్నారు. రోశయ్య మరణం తీరనిలోటని అన్నారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన ఆయన... రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు.

తెలుగు ప్రజలకు తీరనిలోటు..

రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించారని తెలిపారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ,‌ మంత్రి, సీఎం లాంటి ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. రోశయ్య భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు.

ఉన్నత విలువలతో కూడిన వ్యక్తి..

రోశయ్య ఉన్నత విలువలతో కూడిన వ్యక్తని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రోశయ్యతో సుదీర్ఘకాలం పరిచయం ఉందని తెలిపారు. తెదేపా హయాంలో ప్రతిపక్షంలో ఉండి... వ్యక్తిగత దూషణ చేయకుండా హుందాగా ప్రశ్నించేవారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో రోశయ్య పాత్ర ఉందని తెలిపారు. రోశయ్య నివాసానికి చేరుకున్న నాగం ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

స్మృతివనం ఏర్పాటు చేయాలి...

ప్రజాస్వామ్య పునాదులు పటిష్ఠం చేయడంలో రోశయ్య కీలకపాత్ర పోషించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీతి నిజాయతీగా రాజకీయాలు చేసిన నేతగా ఆయన వెలుగొందారని కొనియాడారు. వ్యక్తిగత దూషణ చేయకుండా హుందాగా ఉండేవారని తెలిపారు. రోశయ్య ప్రజాసమస్యలు ప్రస్తావించడం గొప్పగా ఉండేదని గుర్తు చేశారు. ఆయనతో పనిచేసే భాగ్యం తమకు కలిగిందని అన్నారు. ఆర్థికశాఖను నియంత్రించడం ఒక్క రోశయ్యకే సాధ్యం అనే పేరు సంపాదించారని గుర్తు చేశారు. రోశయ్యకు నివాళులర్పించిన భట్టి విక్రమార్క... ఆయన పేరిట ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గాంధీభవన్‌లో ఘన నివాళి...

హైదరాబాద్ గాంధీభవన్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చిత్రపటానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘన నివాళులర్పించారు. టీపీసీసీ పీఏసీ సమావేశంలో రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్​, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌ అలీ, కార్య నిర్వాహక అధ్యక్షులు మహేశ్​కుమార్ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ముఖ్య నాయకులు దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, మల్లు రవి, కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోశయ్య మృతిపట్ల పలువురు కాంగ్రెస్​ నేతల సంతాపం

ఇవీ చదవండి: CM KCR about Rosaiah : 'ఎన్నో పదవులకు రోశయ్య వన్నె తెచ్చారు'

Ex CM Rosaiah funerals: రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

Last Updated : Dec 4, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.