ఇవీ చూడండి: ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ- పెళ్లికి ఒప్పుకోని పెద్దలు
'కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారు' - సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల విమర్శలు
రైతులు, యువతను తెరాస ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అనిల్‌యాదవ్ మండిపడ్డారు. పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
CONGRESS LEADERS FIRE ON CM KCR, MINISTER KTR ABOUT FARMERS, UNEMPLOYEES
మంత్రి కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తూ... యువతను మోసం చేస్తున్నారని పీసీసీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ఔషధనగరి అవసరమా లేదా అన్న చర్చ జరగాలన్న కోదండరెడ్డి... రైతుల నోట్లో మట్టి కొట్టి పారిశ్రామిక వేత్తలకు భూములు కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. యూపీఏ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు కాలేదని కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఐటీఐఆర్‌ను పూర్తి చేస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి ఎందుకు కల్పించట్లేదని ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలంటే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని నేతలు కోరారు.
ఇవీ చూడండి: ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ- పెళ్లికి ఒప్పుకోని పెద్దలు
File : TG_Hyd_42_27_Kodandareddy_ABs_3038066
Reporter : Tirupal Reddy
Note : Feed from Gandhi Bhavan
( ) మంత్రి కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని... యువతను మోసం చేస్తున్నారని పీసీసీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. కొత్త రాష్ట్రానికి ఔషధనగరి అవసరమా లేదా అన్న చర్చ జరగాలన్న ఆయన... రైతుల నోట్లో మట్టి కొట్టి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు భూములు కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని... యూపీఏ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు కాలేదని కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని కోదండరెడ్డి అన్నారు. ఐటీఐఆర్ ను పూర్తి చేస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్... రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారా లేదా అని ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం నిర్వీర్యమయ్యాయన్న పీసీసీ అధికార ప్రతినిధి ప్యాటరమేష్... రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
బైట్ - ఎం.కోదండరెడ్డి, పి.సి.సి. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు
బైట్ - అనిల్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
బైట్ - ప్యాట రమేష్, పి.సి.సి. అధికార ప్రతినిధి