రాజస్థాన్‌లో ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్రలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. భాజపా అనుసరిస్తున్న వైఖరిని ఉత్తమ్ ఖండించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు "స్పీకప్ ఫర్ డెమోక్రసీ'' కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్ముయ్య, ఎమ్యెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించండం కోసం ప్రజలు మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినదించారు. సామాజిక మాధ్యమాలల్లో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు....రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు. రేపు ఉదయం 11 గంటలకు రాజభవన్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల లోపు నాయకులంతా గాంధీభవన్ తరలి రావాలని సూచించారు.