మంత్రి కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు స్పందించారు. కేసీఆర్‌కు బదులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాయాల్సిందని అభిప్రాయపడ్డారు.
అమిత్‌షాకు లేఖరాస్తే 2 ఉపయోగాలు..
ఏ ముఖ్యమంత్రి కూడా తన కుమారుడిపై విచారణ చేయించే సాహసం చేయరన్నారు. అమిత్‌షాకు ఫిర్యాదు చేస్తే రెండు ఉపయోగాలున్నాయని తెలిపారు. భాజపా, తెరాసల మధ్య ఉన్న రహస్య అజెండా కూడా బయడపడే అవకాశం ఉందన్నారు. విచారణకు ఆదేశించకపోతే రెండు పార్టీల మధ్య అవగాహన ఉందన్న విషయం స్పష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రికి రేవంత్ ఫిర్యాదు చేయనట్లయితే.. తానే చేస్తాయని వీహెచ్ స్పష్టం చేశారు.
ఇవీచూడండి: 'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'