టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి మల్లారెడ్డిని పదవి నుంచి తొలిగించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. చిన్న చిన్న ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారంటూ జైలులో పెడుతున్న ఏసీబీ... టికెట్లు అమ్ముకుంటున్న ఆయనపై సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. టికెట్ల కేటాయింపులో జరిగిన సంభాషణలను మీడియాకు వినిపించిన ఆయన... మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానిని దాసోజు స్పష్టం చేశారు.
అవినీతికి పాల్పడితే సొంత కుమారుడిని కూడా జైల్లో పెడతానన్న కేసీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి వ్యవహారం తెలియలేదా అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు ఎవరికి వేస్తున్నారో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించిన దాసోజు... ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే మంత్రి ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'రాష్ట్రాలు వేరైనా... సంస్కృతి, సంప్రదాయాలు ఒకటే'