ETV Bharat / state

'ప్రభుత్వ పొరపాట్ల వల్లే విజయారెడ్డి హత్య' - 'విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలి'

సీఎం కేసీఆర్​ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో అనేక అవకతవకలున్నాయని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదం వల్లే విజయారెడ్డి హత్య జరిగిందన్నారు. ఈ హత్యపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్​ చేశారు.

CONGRESS LEADER VH ON MRO VIJAYA REDDY MURDER
author img

By

Published : Nov 6, 2019, 6:54 PM IST

తహసీల్దార్ విజయారెడ్డి హత్య సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ హత్య వెనుక ఎవరెవరున్నారన్న వాస్తవాలు సీబీఐ విచారణతోనే బయటపడతాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో అనేక అవకతవకలు ఉన్నాయని... విజయారెడ్డి హత్య జరగడానికి అదే కారణమన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లనే విజయారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. తహసీల్దార్​ను హత్య చేసిన సురేశ్​... తెరాస కార్యకర్తేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ మాఫీయా పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీసు శాఖలో పారదర్శకత తీసుకురావాలంటే ఆయా శాఖల బృందాలను కర్ణాటక విధానాలపై అధ్యయనం చేయించాలని వీహెచ్​ సూచించారు.

'విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలి'

ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.