వలస కూలీలకు ఓటు హక్కు లేదనే.. వాళ్లని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వర్గాల వారితో చర్చిస్తుంటే... ముఖ్యమంత్రి మాత్రం ఎలాంటి సలహాలు, సూచనలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. వలస కూలీలు ఆకలితో అలమటించి.. చచ్చిపోతున్నా కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వలసకూలీల విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. స్వచ్చంధ సంస్థలు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నా... వాటికి లెక్కా పత్రం లేదన్నారు.
ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే..