ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. ఈనెల 25న సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ సభలో మోహన్‌భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫిర్యాదు చేశారు.
భారత దేశంలో 130 కోట్ల మంది హిందువులంటూ... ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా మోహన్ భగవత్ మాట్లాడారంటూ వీహెచ్ ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.