ETV Bharat / state

Congress letter to GHMC: 'ఫ్లెక్సీలకు అనుమతి ఉందా.. ఎంత వసూలు చేసారో చెప్పండి' - ఫ్లెక్సీలపై కాంగ్రెస్

తెరాస ప్లీనరీ సందర్భంగా నగరంలో తెరాస నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కాంగ్రెస్​ సీనియర్ నేత జి.నిరంజన్​ ప్రశ్నించారు. వాటికి అనుమతి ఉన్నట్లయితే ఎంత మొత్తం వసూలు చేశారో తెలపాలంటూ జీహెచ్​ఎంసీ కమిషనర్​కు లేఖ రాశారు.

congress leader Niranjan letter to ghmc
ఫ్లెక్సీలపై కాంగ్రెస్​ సీనియర్ నేత జి.నిరంజన్​ లేఖ
author img

By

Published : Oct 26, 2021, 5:22 AM IST

తెరాస ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లీనరీకి సంబంధించి హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, జెండాలకు అనుమతి ఉందా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.నిరంజన్‌ జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించారు. తెరాస ఫ్లెక్సీలకు అనుమతి ఉన్నట్లయితే ఎంత మొత్తం వసూలు చేశారో తెలియచేయాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​కు లేఖ రాశారు.

ఫ్లెక్సీలకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసి ఉంటే ఎంత పెనాల్టీ విధించారో కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీలను, బ్యానర్లను ఎందుకు తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. చట్టాలు, నిబంధనలు అందరికీ సమానం కాదా అని నిలదీశారు. నగరంలో ఇటీవల"టు లెట్" బోర్డ్ పెట్టారని జరిమానా విధిస్తూ నోటీసు ఇచ్చిన విజిలెన్స్ అండ్‌ ఎన్ పోర్స్​మెంట్ విభాగం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తెరాస విషయంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్న జీహెచ్‌ఎంసీ గతంలో వసూలు చేసిన జరిమానాల సొమ్మును తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:

KCR Speech at Plenary: 'రాజీలేని పోరాటంతో సాధించుకున్నాం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.