ముఖ్యమంత్రి కేసీఆర్కు పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ లేఖ రాశారు. లాక్డౌన్ సమయంలో విధించిన చలాన్లు, జరిమానాలను రద్దుచేయాలని.. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ప్రజల నుంచి వసూలు చేసిన నగదునూ తిరిగి చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జప్తు చేసిన వాహనాలనూ ఎలాంటి జరిమానా విధించకుండా వాహనదారులకు అప్పగించాలని కోరారు.
లాక్డౌన్లో బయటకు వచ్చిన వారు ఉద్దేశపూర్వకంగా రాలేదని.. తప్పని పరిస్థితుల్లోనే వచ్చారన్నారు. ఉపాధి లేక ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో జరిమానాల రద్దు.. వసూలు చేసిన సొమ్ము తిరిగి చెల్లిస్తే ప్రజలకు కొంతైనా ఊరట కలుగుతుందని నిరంజన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ను కోరారు.
ఇవీచూడండి: Eatala : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల