రోజుకు 10 టీఎంసీ నీళ్లను తరలించే ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వం చేస్తోంది. వరదనీళ్లు రాయలసీమకు మళ్లించడంపై తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రోజే చెప్పాము. వికారాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తీవ్రమైన నీటి ఎద్దడి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడకపోవడానికి... జగన్-కేసీఆర్‌ల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింది?. నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణలో రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టడంలో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెడతారని ఎప్పుడు ఊహించలేదు.
-మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?