ETV Bharat / state

'ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడాలి'

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌ పర్సన్‌ విజయశాంతి అన్నారు. సీబీఐ, ఐటీ దాడుల పేరుతో విపక్షాలకు చెందిన నేతలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలి : విజయశాంతి
author img

By

Published : May 1, 2019, 8:04 AM IST

విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను తమవైపు ఎలా తిప్పుకోవాలనే కుట్రను మోదీని చూసి కేసీఆర్ నేర్చుకున్నారని హైదరాబాద్​లో నిర్వహించిన ఓ సమావేశంలో పీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌ పర్సన్‌ విజయశాంతి ధ్వజమెత్తారు. పశ్చిమ బంగాలోని టీఎంసీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనను సంప్రదించారని, లోక్​సభ ఫలితాలు వచ్చిన వెంటనే మమత ప్రభుత్వం పడిపోతుందని మోదీ హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని దుయ్యబట్టారు.

ఈ దుస్సాంప్రదాయానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే తమ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని సంస్కరించనున్నట్లు పొందుపరిచామని విజయశాంతి తెలిపారు. కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భాజపాయేతర పార్టీలన్ని మద్దతిచ్చి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. సీబీఐ, ఐటీ దాడుల పేరుతో ప్రతిపక్షాలకు చెందిన నేతలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలకు చరమగీతం పాడేందుకు రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు.

సీబీఐ, ఐటీ దాడుల పేరుతో విపక్షనేతలను భయాందోళనకు గురిచేస్తున్నారు : విజయశాంతి

ఇవీ చూడండి : ఖైరతాబాద్​ మహాగణపతి విగ్రహ ఏర్పాటుకు తొలిపూజ

Intro:TG_MBNR_25_30_VARSHA_BHEEBHASTAM_PKG_R46_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) దీనికి సంబంధించిన ప్యాకేజీ స్క్రిప్ట్ ను మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ స్వామి కిరణ్ గారు పంపుతారు తీసుకోగలరు.

Body:TG_MBNR_25_30_VARSHA_BHEEBHASTAM_PKG_R46_C8

Conclusion:TG_MBNR_25_30_VARSHA_BHEEBHASTAM_PKG_R46_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.