ETV Bharat / state

రేపే నామినేషన్లకు చివరి తేదీ, ​ తుది జాబితాపై కాంగ్రెస్ కసరత్తులు - కాంగ్రెస్ నాలుగో జాబితా అభ్యర్థులు

Congress Fourth Candidates List Issues : కాంగ్రెస్​లో ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా కోసం ఏఐసీసీ కసరత్తులు ప్రారంభించింది. టికెట్ల కోసం అభ్యర్థులకు సీనియర్​ నేతలు మద్దతు ఇస్తుంటే.. టికెట్​ ఎవరికివ్వాలన్న యోచనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం సమయం వేళ.. పార్టీ నేతల మధ్య ఐక్యత లోపిస్తే అది గెలుపు అవకాశాలపై పడుతుందని భావిస్తోంది

Congress MLA Ticket Clashes
Congress Fourth Candidates List Issues
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 7:38 PM IST

Congress Fourth Candidates List Issues : తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రతిష్ఠంభన నెలకొన్న నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ రాష్ట్ర నాయకులతో చర్చిస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకులు బోసు రాజు, దీపాదాసు మున్సీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్‌ రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శులు ప్రకటించిన నాలుగు నియోజక వర్గాలకు చెందిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

ఎర్రబెల్లి వల్లే నేను జైలుకు పోవాల్సి వచ్చింది: రేవంత్ రెడ్డి

తాజ్​కృష్ణాలో ఆయా నియోజక వర్గాలకు చెందిన వారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించి సర్వేల నివేదికలు కూడా తెప్పించుకుని సంబంధిత నాయకుల ఎదుటనే.. తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. గురువారం రాత్రి సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్‌ నియోజక వర్గాలకు చెందిన అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. సూర్యాపేట టికెట్‌ ఖరారు వ్యవహారమే కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.

Congress MLA Ticket Clashes : పటేల్‌ రమేష్‌ రెడ్డి, ఆర్‌.దామోదర్‌ రెడ్డిలు ఇద్దరు కూడా పార్టీకి కావాల్సిన వారు కావడం.. ఎవరికి టికెట్‌ ఇచ్చిన మరొకరు మద్దతు ఇవ్వరు. మద్దతు లేకుంటే ఎవరికి టికెట్‌ ఇచ్చినా కాంగ్రెస్‌ మాత్రం గెలిచే అవకాశం ఉండదని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆశావాహులతో కాంగ్రెస్​కు చిక్కులు ఎదురయ్యాయి. ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వకపోతే నేతల మధ్య ఎక్కడ ఐక్యత లోపిస్తుందనే భావనలో ఏఐసీసీ ఆలోచిస్తుంది.

ఖమ్మంలో అసెంబ్లీ సమరోత్సాం - మళ్లీ సత్తాచాటే లక్ష్యంతో ముందుకెళ్తున్న కమ్యూనిస్టులు

అదే విధంగా పటాన్‌ చెరులో నీలం మధు ముదిరాజ్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. బీ ఫామ్‌ ఇవ్వకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇక్కడ కాట శ్రీనివాస్‌ గౌడ్‌కు మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, నీలం మధుకు మద్దతుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు నిలుస్తున్నారు. దీంతో అక్కడ సీనియర్‌ నేతలు ఇద్దరు ఎవరికి వారు పట్టుబడుతుండడంతో ఎటూ తేల్చలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రికి వీరిద్దరిని పిలిపించి చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Congress Leader Suicide Attempt For MLA Ticket : బాన్సువాడ కాంగ్రెస్‌ నాయకుడు బాలరాజు ఆత్మహత్యాయ్నం చేసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితిని కూడా చక్కబెట్టేందుకు కేసీ వేణుగోపాల్‌ రంగంలోకి దిగారు. నర్సాపూర్‌లో గాలి అనిల్‌కుమార్‌ బదులు రాజిరెడ్డికి టికెట్‌ ఇచ్చారు. దీంతో గాలి అనిల్‌ కుమార్‌ ఇప్పటికే నామినేషన్‌ వేశారు. పార్టీ దృష్టికి తీసుకెళ్లగా చర్చిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. మహేశ్వరంలో కూడా పారిజాత నర్సింహారెడ్డిని పక్కన పెట్టి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్‌ ఇచ్చారు. అక్కడ ఆయన స్థానంలో తనకు టికెట్‌ బీ ఫామ్ ఇవ్వాలని పారిజాత రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్‌ వ్యవహారాన్ని చక్కబెట్టాల్సి ఉంది.

ఆచితూచి అడుగేస్తున్న విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి

రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ - ఇంకా తెగని కాంగ్రెస్ అభ్యర్థుల పంచాయితీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.