ETV Bharat / state

కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల కోసం పోటీ - సర్దుబాటుపై స్వయంగా సీఎం రేవంత్‌ ఫోకస్ - Telangana Congress latest news

Congress Focus on Nominated Posts : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో, పీసీసీ పదవితోపాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్‌ పదవుల కోసం నాయకులు బారులు తీరుతున్నారు. టికెట్లు త్యాగం చేసిన వారితోపాటు, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నేతలు కూడా పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వారికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికి కూడా సర్దుబాటు చేయాల్సి ఉండడంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే నిశితంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Congress government focus on nominated posts

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 8:51 AM IST

కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల కోసం పోటీ

Congress Focus on Nominated Posts : తెలంగాణలో పదేళ్లపాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్‌ను ఎదురొడ్డి, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం తీవ్రంగా శ్రమించాయి. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ( Revanth Reddy), మిగిలిన కీలక నేతలు పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో పని చేశారు. అధికార పార్టీని ఎదుర్కొని హస్తం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడంతోనే సాధ్యమైందన్న భావన రాష్ట్ర నాయకత్వానికి ఉంది.

ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం ప్రత్యేక దృష్టి : ఈ నెల 7న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో, ఆరు గ్యారెంటీలను (Congress Six Guarantees) అమలు చేస్తామని ఇచ్చిన హామీలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చారు.

తొమ్మిదిన్నరేళ్ల అస్తవ్యస్త పాలనను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం : మంత్రి జూపల్లి

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)సమీక్షలు చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, సాధారణ పరిపాలనకు అవసరమైన నిధులను, మినహాయించి అందుబాటులో ఉన్న నిధులను మిగిలిన గ్యారెంటీలను అమలు చేసేందుకు ఉపయోగించేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

నామినేటేడ్ సీట్ల కోసం నాయకుల జాబితా చాంతాడంత : మరోవైపు ఆర్థిక వెసులుబాటు ఆధారంగా రైతుబంధు అమలు, మిగిలిన గ్యారెంటీలను అమలు చేసేందుకు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు, పార్టీ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల సీట్ల కోసం నాయకుల జాబితా చాంతాడంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నేతలతో పాటు, టికెట్లు త్యాగం చేసిన నాయకులు కూడా పదవులను ఆశిస్తున్నారు.

ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : దామోదర్ రాజనర్సింహా

Competition for Nominated Posts in Telangana Congress : ఇప్పటికిప్పుడు రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు, మరొకటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో ఉన్నాయి. సీపీఐతో పొత్తు పెట్టుకున్న సమయంలో ఒక టికెట్‌తో పాటు, ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పార్టీకి ఒక సీటు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా టికెట్లు అడగకుండా పార్టీ కోసం పని చేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌ రెడ్డి, సురేశ్‌ షెట్కార్‌, ఇరావత్రి అనిల్‌ కుమార్‌, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఉన్నారు.

Telangana Congress Leaders now Seek MLA, MP Seats and Nominated Posts : అలాగే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనరెడ్డి ఉన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్‌, మహిళా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పీసీసీ అధికార ప్రతినిధుల్లో అద్దంకి దయాకర్‌, చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌, భవానిరెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం (TJS President Kodandaram), విజయశాంతి, చిన్నారెడ్డి తదితరులు పోటీ పడుతున్నారు.

ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్న నేతలు : ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ పదవి సీఎం వద్దనే ఉంచుకోవాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. అయినా ఆ పదవి కోసం మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పోటీ పడుతున్నారు. మరో వైపు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ పోస్టుల కోసం కూడా, ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - 54 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.