ETV Bharat / state

పీసీసీ కొత్త సారథి కోసం కాంగ్రెస్ కసరత్తు - tpcc latest updates

తెలంగాణ పీసీసీ కొత్త సారథి నియామకంపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పీఠంపైనా.. కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పదవి ఆశిస్తున్న పలువురు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కొద్దికాలం క్రితం పీసీసీ అధ్యక్షుడిని నియమించగా, అధిష్ఠానం తాజాగా కర్ణాటక, దిల్లీ పీసీసీలకు అధ్యక్షులను ప్రకటించింది.

Congress drills for new leader of PCC
పీసీసీ కొత్త సారథి కోసం కాంగ్రెస్ కసరత్తు
author img

By

Published : Mar 13, 2020, 6:18 AM IST

2014 శాసనసభ ఎన్నికల అనంతరం తెలంగాణలో పార్టీ సారథ్యం చేపట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల అనంతరమే పీసీసీ పీఠాన్ని వదులుకుంటానని ప్రకటించారు. నాటి నుంచి అధ్యక్షుని మార్పుపై ఊహాగానాలు సాగుతున్నా.. అధిష్ఠానం నుంచి ఎలాంటి సంకేతాలూ వెలువడలేదు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చుతున్న క్రమంలో తెలంగాణ విషయం కూడా చర్చల్లోకి వస్తోంది. ఎన్నికలకు మరో నాలుగేళ్ల గడువు ఉంది. ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలంటే అధ్యక్షుల నియామకం అవసరమనే అభిప్రాయాన్ని పలువురు నేతలు పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిసింది.

ఆచితూచి వ్యవహరిస్తోన్న అధిష్ఠానం..

కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పరిశీలకులను నియమించి రాష్ట్ర నేతల అభిప్రాయాలను తీసుకుని సాధ్యమైనంత వరకూ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తుందని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డిలతో పాటు జగ్గారెడ్డి పేర్లు పార్టీ వర్గాల మధ్య చర్చల్లో ఉన్నాయి.

సోనియాతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ..

ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కావడం పార్టీలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. గురువారం ఉదయం సోనియాను కలిసిన కోమటిరెడ్డి ఆమెతో సుమారు 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పని తీరు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితిపై అధిష్ఠానం ఆరా తీసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: కరోనా రాకుండా ఏం చేయాలో చూడండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.