ETV Bharat / state

భవన నిర్మాణ కూలీల సొమ్మును ఎలా మళ్లిస్తారు ? కాంగ్రెస్ - CONGRESS COMPLAINTS TO HRC AND NHRC

బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ బోర్డుకు చెందిన సుమారు 300 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. బోర్డు పరిధిలో 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సభ్యులుగా ఉన్నారని గుర్తు చేసింది.

'మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం'
'మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం'
author img

By

Published : Apr 20, 2020, 8:37 PM IST

బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ బోర్డుకు చెందిన రూ. 300 కోట్లను పౌరసరఫరాల శాఖకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ఖండించింది. సుమారు 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. అందులో రూ.1500 కోట్లు సెస్‌ నిధులు ఉన్నట్లు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ పేర్కొన్నారు. ఆ డబ్బు అంతా కూడా... కార్మికులకు చెందాలని అన్నారు.

అది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం...

అలా కాకుండా అందులోని 300 కోట్లను పౌర సరఫరాల శాఖకు ఇవ్వడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. సుప్రీం గైడ్ లైన్స్​కు వ్యతిరకంగా నిధులు దారి మళ్లించడం ఏమిటని నాయక్ ప్రశ్నించారు. బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ బోర్డుకు చెందిన నిధులను ఇతర శాఖలకు ఇవ్వడం మంచిది కాదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కార్మిక కూలీల పొట్ట కొట్టేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మానవహక్కుల కమిషన్‌కు కాంగ్రెస్ పక్షాన ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి : 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.