ETV Bharat / state

అద్దె కట్టలేని వారికి ప్రభుత్వమే అండగా నిలవాలి: జగ్గారెడ్డి

రాష్ట్రంలో ఇంటి అద్దెలు కట్టలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వమే అద్దె చెల్లించి అండగా నిలవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఖరీప్​లో అన్నదాతలకు ఉచితంగా విత్తనాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.

congress demands to government of telangana
అద్దె కట్టలేని వారికి ప్రభుత్వమే అండగా నిలవాలి: జగ్గారెడ్డి
author img

By

Published : May 4, 2020, 9:36 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో కొన్ని పేద, మధ్యతరగతి కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయని, అలాంటి కుటుంబాలకు ప్రభుత్వమే అద్దెలు చెల్లించి, అండగా నిలవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. 15వేలు అద్దె చెల్లించే కుటుంబాలు రాష్ట్రంలో ఎన్నిఉన్నాయో... ఒక సర్వేచేసి ఎంతమంది ఉన్నారో తెలుసుకొని.. విధానపరమైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఇంటిపన్ను, విద్యుత్తు, నీటి బిల్లులు పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

రైతులకు ఖరీఫ్‌లో ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, పరిశ్రమలకు కూడా విద్యుత్తు బిల్లులు మాఫీ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. భాజపా పక్షాన రాష్ట్రంలోని ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు అధికంగా తెచ్చేందుకు చొరవ చూపాలన్నారు. ఉపాధి హామీ కూలీలను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యం ఫీల్డ్​లోనే ఉంటున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: 'మంత్రులు మాయమాటలు చెప్పి మార్కెట్​ను తరలించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.