ETV Bharat / state

ఇవాళ తహసీల్దార్ ఆఫీసుల ముందు నిరసన: ఉత్తమ్ - Tahsildhar Latest News

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జూలై 6న విద్యుత్ ఛార్జీల అవకతవకలపై నల్లజెండాలతో నిరసనలు ప్రదర్శిస్తామన్నారు.

శనివారం తహసీల్దార్ ఆఫీసుల ముందు నిరసన: ఉత్తమ్

author img

By

Published : Jul 3, 2020, 8:23 PM IST

Updated : Jul 4, 2020, 5:54 AM IST

నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కేంద్రం అంతకంతకూ పెంచుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునిచ్చింది. సోమవారం 6న రాష్ట్రంలో అడ్డగోలుగా విధించిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తామన్నారు. మండల విద్యుత్ కార్యాలయాల ఎదుట నల్ల జెండాలతో ధర్నా చేయనున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. కాంగ్రెస్ క్యాడర్​తో ఉత్తమ్ ఫేస్ బుక్ వేదికగా లైవ్​లో మాట్లాడారు.

కేంద్రం దోచుకుంటోంది..

కొవిడ్ కష్టకాలంలో ప్రజలును కేంద్రం దోచుకుంటోందని ఉత్తమ్ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలనూ అడ్డగోలుగా పెంచారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోయినా.. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు ధర బ్యారెల్​కు 40 డాలర్ల మేర పడిపోయినా.. పెట్రోల్ డీజిల్ ధర మాత్రం లీటర్ రూ.80కి ఏగబాకింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ఇష్టానుసారంగా ఎక్సైజ్ పన్ను, రోడ్డు సెస్ వేశారన్నారు. ఫలితంగా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని వివరించారు.

వస్తువుపై ప్రభావం..

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ప్రతి వస్తువుపైనా ఆ ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో పన్నులు పెరిగితే ఆదాయం వస్తుందని తెరాస సర్కార్ కేంద్రానికి వ్యతిరేకంగా నోరు మెదపట్లేదని ఉత్తమ్ తప్పుబట్టారు.

వాహనాలకు నల్ల జెండాలు..

కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులను అడ్డగోలుగా వేశారన్నారు. రావాల్సిన బిల్లు కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగానే బాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 6న రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగర వేయాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. వాహనాలకు సైతం నల్ల జెండాలు కట్టుకోవాలన్నారు. నాన్ టెలిస్కోపిక్ విధానంలో తీసిన బిల్లులు పేదలకు భారమైందన్నారు. టెలిస్కోపిక్​ విధానం కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమ చేయాలన్నారు. బీపీఎల్ కుటుంబలకు పూర్తిగా కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ పనుల ప్రగతిపై కేటీఆర్‌ సమీక్ష

Last Updated : Jul 4, 2020, 5:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.