కాంగ్రెస్ అధిష్ఠానం ఇవాళ మరో ఆరుగురు డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వారి పేర్లను ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కమిటీ కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, ములుగు, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకానికి ప్రతిపాదనలు పంపించారు. కాంగ్రెస్ అధిష్ఠానం... రాష్ట్ర నాయకత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి పేర్లను ఆమోదించింది.
- కుమురం భీం ఆసిఫాబాద్ -కె.విశ్వప్రసాదరావు
- జయశంకర్ భూపాలపల్లి- అయిత ప్రకాష్ రెడ్డి
- వికారాబాద్- టి.రామోహన్ రెడ్డి
- ములుగు- నల్లెల కుమార్ స్వామి
- నారాయణపేట- శివకుమార్ రెడ్డి
- యాదాద్రి భువనగిరి- కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
ఇవీ చూడండి:రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ