పీసీసీ అధ్యక్షుడి మార్పు లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడిని నియమిస్తారన్న ఊహాగానాలకు తెరదించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై త్వరలో క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పార్టీపై నేతలెవరూ బహిరంగ విమర్శలు చేయవద్దని, ఫిర్యాదులుంటే నేరుగా రాహుల్ గాంధీని కలవొచ్చని సూచించారు. ఈనెల 29న నాగార్జున సాగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని వెల్లడించారు. పురపాలక ఎన్నికలకు సంబంధించిన వ్యూహ రచనకు పొన్నం నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి : యాదగిరిగుట్టలో కోమటిరెడ్డికి ఘన సన్మానం