ETV Bharat / state

ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి చేదు అనుభవం.. అడ్డుకున్న కాంగ్రెస్​ నేతలు.. - సాహెబ్​నగర్​లో తెరాస, కాంగ్రెస్​ నేతల మధ్య వాగ్వాదం

సాహెబ్​నగర్​లో తెరాస, కాంగ్రెస్​ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందిన ఘటనలో.. అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్​రెడ్డిని కాంగ్రెస్​ శ్రేణులు అడ్డుకున్నారు.

tensions in saheb nagar
సాహెబ్​నగర్​లో ఉద్రిక్తత
author img

By

Published : Aug 4, 2021, 1:42 PM IST

Updated : Aug 4, 2021, 2:48 PM IST

హైదరాబాద్​ సాహెబ్​ నగర్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెరాస, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి సాహెబ్​నగర్​లోని ఓ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు.. లోపల ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన మరొక కార్మికుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఒక కార్మికుడి మృతదేహం లభ్యమవడంతో.... అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు ఎల్బీనగర్​ తెరాస ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి వెళ్లారు. ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించడంతో... కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది.

సాహెబ్​నగర్​లో ఉద్రిక్త వాతావరణం

నిన్న రాత్రి డ్రైనేజీ శుభ్రం చేయాలంటూ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు అంజయ్య, శివలకు పిలుపు రావడంతో వారు అక్కడికి వెళ్లారు. శుభ్రం చేస్తుండగా లోపల ఊపిరాడక ఇద్దరూ మృతి చెందారు. మృతులు చంపాపేట్​, సరూర్​నగర్​లకు చెందిన వారు కాగా.. రాత్రివేళల్లో ఇలాంటి పనులు చెబుతున్న కాంట్రాక్టర్లపై స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

Last Updated : Aug 4, 2021, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.