అమీర్‌పేటలో నూతన ప్రభుత్వాస్పత్రి (New Government House at Ameerpet)ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి( Kishan Reddy), మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రారంభించారు. ఆస్పత్రి (New Government House at Ameerpet) ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైద్యారోగ్య శాఖ 50 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అధునాతన సౌకర్యాలతో ఏరియా ఆస్పత్రి(New Government House at Ameerpet)ని తీర్చిదిద్దారు. సాధారణ ఓపీ సేవలతో పాటు ఆపరేషన్ థియేటర్, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇంతవరకు బాగానే జరిగినా.. అప్పుడే రాసాభాస జరిగింది.
ప్రారంభోత్సవ కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు ముందు వరుసలో లేదని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెరాస కార్యకర్తలు వారికి పోటీగా నినాదాలు చేశారు. పరస్పర నినాదాలతో ఉద్రిక్తత ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను అక్కడ నుంచి పంపించివేశారు. సభావేదిక ఏర్పాటు చేసినా కిషన్‌రెడ్డి, తలసాని మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
.
ఇదీ చూడండి: నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం- కోలుకోవాలని ప్రధాని ఆకాంక్ష