ETV Bharat / state

మొక్క పోయిందని పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు

మొక్కనే ప్రాణంగా పెంచుకుంటున్నాడు ఓ విశ్రాంత ఐపీఎస్​ అధికారి. అంతలోనే దానిపై దొంగలు కన్నేశారు. అత్యంత ఖరీదైన ఆ మొక్కను ఎత్తుకెళ్లారు. అత్యంత ఇష్టమైన మొక్క చోరీకి గురవడంతో జూబ్లీహిల్స్​ పోలీసులను ఆశ్రయించాడు.

plant theft in jubleehills
మొక్క పోయిందని పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు
author img

By

Published : Jan 12, 2021, 10:46 PM IST

ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కను దొంగిలించారని పోలీస్​స్టేషన్​లో ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 18లో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అప్పారావు నివాసముంటున్నారు. ఆయన ఇంట్లోనే ఎన్నో అరుదైన మొక్కలను పెంచుతున్నారు.

ఆయన పెంచుకుంటున్న అరుదైన మొక్కల్లో బొన్సాయి ఒకటి. దీని విలువ మార్కెట్‌లో లక్ష రూపాయలకు పైగా పలుకుతుందని అప్పారావు తెలిపారు. ఆ మొక్కను దొంగతనం చేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 40ఏళ్లుగా అరుదైన మొక్కలు పెంచుతున్నానని, ఎప్పుడూ ఇలా చోరీకి గురికాలేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: దేశ రైతులు సాధించిన పాక్షిక విజయం: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.