హైదరాబాద్ చిక్కడపల్లి ఎస్సైపై శ్రీధర్ అనే యువకుడు సీపీకి ఫిర్యాదు చేశాడు. చిక్కడపల్లి సూర్యనగర్‌కు చెందిన శ్రీధర్ అనే యువ కుడు గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఓ యువతి రాష్ డ్రైవింగ్‌తో తన తల్లికి గాయం చేసిందని చిక్కడపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విషయంలో చిక్కడపల్లి ఎస్సై కిషోర్ తన ఇంటికి వచ్చి విచారణ చేపట్టారని అతడు చెప్పాడు. విచారణకు వచ్చిన సమయంలో డబ్బులు డిమాండ్ చేశాడని బాధితుడు తెలిపాడు. గత ఏడాది అక్టోబర్‌లో కేసు చివరి దశకు చేరుకుందని... ఆ సమయంలో 20 వేల రూపాయలు ఇవ్వమని అడిగాడని... ఆ డబ్బు తిరిగి ఇస్తానని ఎస్సై చెప్పడం వల్ల తాను డబ్బు ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. లాక్‌డౌన్ వేళ ఇబ్బందిగా ఉందని డబ్బులు తిరిగివ్వమని ఎస్సైని శ్రీధర్ కోరాడు. అయితే తాను ఆ డబ్బులు ఇవ్వనంటూ.. ఎస్సై కిషోర్ దుర్భాషలాడారని శ్రీధర్ సీపీకి ఫిర్యాదు చేశాడు.
ఇన్స్పెక్టర్ వివరణ
లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సూర్యనగర్ లో అనునిత్యం సంచరిస్తూ, రాత్రి సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఫిర్యాదు మేరకు పోలీసులు మందలించడం జరిగిందని ఇన్స్పెక్టర్ శివశంకర్ రావు తెలిపారు. చిక్కడపల్లి ఎస్సై కిషోర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇవీ చూడండి: ఆ ఇంట్లో 5 మృతదేహాలు- ఏం జరిగింది?