ETV Bharat / international

ఆ ఇంట్లో 5 మృతదేహాలు- ఏం జరిగింది? - milwaukee mass shooting

అమెరికాలో మిల్​వౌకీ నగరంలో తుపాకీ విష సంస్కృతి మరో ఐదుగురిని పొట్టనపెట్టుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన గురించి పోలీసులకు తెలియజేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

US-HOOTING
తుపాకీ
author img

By

Published : Apr 28, 2020, 2:01 PM IST

అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మిలవౌకీ నగరంలోని ఓ ఇంట్లో ఐదుగురు విగత జీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వీరిని ఎవరో కాల్చి చంపినట్లు తెలిపారు అధికారులు.

"ఉదయం 10.30 గంటల సమయంలో అత్యవసర నంబర్​ 911కు కాల్​ వచ్చింది. తన కుటుంబంలోని ఐదుగురు చనిపోయారని ఓ వ్యక్తి చెప్పాడు. వెంటనే ఇంటికి వెళ్లి చూడగా ఐదు మృతదేహాలు ఉన్నాయి. వారంతా 14 నుంచి 41 మధ్య వయస్కులే. "

- టామ్ బారెట్​, మేయర్

శిశువును విడిచిపెట్టి..

ఆ ఇంట్లో ఓ శిశువు మాత్రం ప్రాణాలతో ఉందని మేయర్ తెలిపారు. హంతకుడు ఆ చిన్నారిని వదిలేసి ఉంటాడని భావిస్తున్నామన్నారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఘాతుకానికి పాల్పడింది ఒక్కడేనని అంచనాకు వచ్చారు.

ప్రాథమిక విచారణలో భాగంగా ఫోన్​ చేసిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. బాధిత కుటుంబానికి అతనికి సంబంధం ఏంటనే కోణంలో విచారిస్తున్నారు.

ఈ ఏడాది రెండోది..

మిల్​వౌకీలో ఈ ఏడాది జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. ఫిబ్రవరి 26న ఓ వ్యక్తి తన ఐదుగురు సహోద్యోగులను చంపి తనను తాను కాల్చుకున్నాడు. 2012లో జాత్యాంహకార వాది మైఖేల్ పేజ్​.. సిక్కుల ఆలయం వద్ద ఏడుగురిని కాల్చిచంపాడు. అనంతరం పోలీసుల అతనిని మట్టుబెట్టారు.

2005లో జరిగిన ఘటనను మిల్వౌకీలోనే అతిపెద్దది చెప్పుకొంటారు. బ్రూక్​ఫీల్డ్ ప్రాంతంలోని చర్చిలో టెర్రీ మైఖేల్ రాట్జ్​మన్​ అనే వ్యక్తి ఏడుగురిని కాల్చి.. తనను తాను కాల్చుకున్నాడు. ఇప్పటివరకు ఈ ఘటనకు కారణాలు తెలియరాలేదు.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్​ ముసుగులో యువతకు ఉగ్రమూకల ఎర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.