ETV Bharat / state

గోల్నాక మృతుల్లో ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం - LATEST CRIME NEWS IN HYDERABAD

హైదరాబాద్‌లోని గోల్నాక ఫంక్షన్‌హాల్‌లో కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్ర గాయాలు కాగా... క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారాన్ని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.

Compensation for FUNCTIONAL WALL COLLAPSED died people IN HYDERABAD GOLNAKA
author img

By

Published : Nov 10, 2019, 5:36 PM IST

హైదరాబాద్ గోల్నాకలోని ఫంక్షన్​హాల్​ గోడ కూలిన ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబ సభ్యులకు ఒక్కోక్కరికి రూ.రెండు లక్షల పరిహారం ప్రకటించారు. గాయాలపాలైన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జోనల్ కమిషనర్లను బొంతు రామ్మోహన్​ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గ్రేటర్​లో గుర్తించిన శిథిల భవనాలను వెంటనే ఖాళీ చేయించి... సమీపంలోని కమ్యూనిటీ హాళ్లలోకి ప్రజలను చేర్చాలని వెల్లడించారు.

ఇవీ చూడండి: కూలిన ప్రహరీ.. నలుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.