KTR America Tour Updates : పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతగా సాగుతోంది. ఈ క్రమంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో తమ ఎంప్లాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వీఎక్స్ఐ గ్లోబల్ సంస్థ ప్రకటించింది. పది వేల మంది ఉద్యోగులతో ఎంప్లాయి సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ వీఎక్స్ఐ గ్లోబల్ సంస్థ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ ఎరికా బోగర్ కింగ్ సమావేశమయ్యారు.
Travel company Mandi investments in telanagan : ప్రముఖ ట్రావెల్ సంస్థ మాండీ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2 వేల మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా మాండీ సంస్థ ఛైర్మన్ ప్రసాద్ గుండుమోగులను కలిశారు. ట్రావెల్ రంగంలో దిగ్గజ సంస్థ అయిన మాండీ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Rave Gears Company on Hyderabad : ప్రముఖ గేర్ల ఉత్పత్తి సంస్థ రేవ్ గేర్స్ తెలంగాణలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా రేవ్ గేర్స్ సంస్థ ప్రతినిధి బృందాన్ని కలిసినట్లు కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. సమావేశంలో మంత్రితో పాటు ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఎన్‌ఆర్‌ఐ ఎఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి గేర్లు ఉత్పత్తి చేసే రేవ్ గేర్స్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
మొట్టమొదటి గ్లోబల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన స్టోరెబుల్ సంస్థ హైదరాబాద్‌లో తమ సేవలను విస్తరించేందుకు చూస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ విస్తరణ ప్రణాళికపై చర్చించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపాలో సెల్ఫ్ స్టోరేజీ పరిశ్రమలో సేవలు అందిస్తున్న స్టోరెబుల్ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ నగరం నుంచి 100 మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లను హైర్ చేసుకుని తమ విస్తరణ ప్రణాళికపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది.
డిజిటల్ సొల్యూషన్స్ రంగంలో అగ్రగామి అయిన రైట్ సాఫ్ట్‌వేర్ సంస్థ తెలంగాణలోని ప్రముఖ విద్యాసంస్థలతో కలిసి తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 30న హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సంస్థ పేర్కొంది. దీని ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి: