రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి ప్రథమ కొత్వాల్‌గా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలోని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వెంకటరామ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని నగర పోలీస్ కమిషనర్ కొనియాడారు. వృత్తిలో ప్రతిభకనబరిచిన వారికి స్మారక బంగారు పతకాన్ని, రూ. 5వేల నగదును అందజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కె.వి.రంగారెడ్డి కుమారుడు ప్రొఫెసర్ కె. రామచంద్రారెడ్డి సైబరాబాద్ క్రైం ఎస్సై విజయవర్ధన్‌కు బంగారు పతకాన్ని అందజేశారు.
ఇదీ చూడండి: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం @ నెం.5