ETV Bharat / state

రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న పన్నుల ఆదాయం - telangana varthalu

రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడి 50వేల కోట్లు మించేలా క‌నిపిస్తోంది. జనవరిలో 22 శాతం, ఫిబ్రవ‌రిలో 15.5శాతం లెక్కన వాణిజ్య ప‌న్నుల‌ ఆదాయంలో పెరుగుదల నమోదైంది. మద్యం అమ్మకాల రాబడి సైతం జ‌న‌వ‌రిలో 18 శాతం, ఫిబ్రవ‌రిలో 17శాతం లెక్కన వృద్ధి క‌న‌బర్చింది. ఫిబ్రవరి వరకు వచ్చిన వాణిజ్య రాబడులు గతేడాదితో పోలిస్తే.. 7.53 శాతం వృద్ధి న‌మోదై... 3 వేల 211 కోట్లు అధికంగా ఆదాయం వచ్చినట్లు వాణిజ్య ప‌న్నుల శాఖ‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న పన్నుల ఆదాయం

author img

By

Published : Mar 13, 2021, 4:12 AM IST

రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న పన్నుల ఆదాయం

రాష్ట్రంలో కొవిడ్, లాక్‌డౌన్‌ ప్రభావాల నుంచి బయటపడి... పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో పెరుగుతున్నాయి. వాణిజ్య పన్నుల ఆదాయం అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరి నెలలోనూ వ్యాట్‌తోపాటు, జీఎస్టీ రాబడులు గతేడాది కంటే ఎక్కువ‌గా వ‌చ్చాయి. గ‌తేడాది ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు అయిదు నెల‌ల్లో వ‌చ్చిన ఆదాయంతో... అంత‌కు ముందు ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన రాబ‌డుల‌తో పోల్చితే 5 వేల 59 కోట్ల మేర తగ్గింది. సెప్టెంబర్‌ నుంచి తిరిగి రాబడిలో వృద్ధి నమోదవుతోంది. సెప్టెంబరులో 3వేల 890 కోట్లు రాబడితో.. అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే..18 శాతం పెరుగుద‌ల నమోదు చేసింది. అక్టోబరులో 4వేల 957 కోట్ల ఆదాయం రాగా... 2019 అక్టోబర్‌తో పోలిస్తే 58 శాతం వృద్ధి కనబర్చింది. నవంబరులో 6వేల 876కోట్లతో.... 77శాతం వృద్ధి నమోదు చేసింది. డిసెంబర్‌లో 5 వేల812కోట్లు వసూలై... 27.31శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది జనవరిలో 5 వేల 223కోట్లతో... గతేడాది కంటే 22శాతం అధికంగా రాబడి వచ్చింది. ఫిబ్రవరిలో 5వేల 95 కోట్లు రాబ‌డిరాగా..గతేడాది ఇదేనెల కంటే అది 15.5శాతం అధిక‌మ‌ని వాణిజ్య ప‌న్నుల శాఖ అధికారులు వెల్లడించారు.

50వేల కోట్లు దాటుతాయి...

2020-21 ఆర్థిక ఏడాదిలో గ‌త సెప్టెంబరు నుంచి వాణిజ్య ప‌న్నుల రాబ‌డుల ప‌రంప‌ర‌ను ప‌రిశీలిస్తే... 2019-20 కంటే ఎక్కువ ఆదాయం వ‌స్తుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. 2019-20 ఆర్థిక ఏడాదిలోమొత్తం 47వేల658కోట్ల ఆదాయం రాగా... 2020-21లో ఫిబ్రవరి వరకు 11 నెలల్లోనే.. 45వేల 853 కోట్లు వ్యాట్‌, జీఎస్టీ రూపంలో వసూలయ్యాయి. ఇదే సమయానికి గతేడాదితో పోలిస్తే ..రాబడుల్లో 7.53శాతం వృద్ధిరేటు నమోదై.. 3 వేల 211 కోట్లు అధికంగా రాబడి వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. పెట్రోల్‌ అమ్మకాల ద్వారా వ్యాట్ ఆదాయం 7వేల 760 కోట్లు, మద్యం విక్రయాలపై 10వేల505 కోట్లు రాగా... మిగిలిన మొత్తం జీఎస్టీ రాబ‌డిగా అధికారులు వివ‌రించారు. ఈ ఆర్థిక ఏడాది గ‌డిచిన 11 నెల‌ల్లో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి 4వేల273 కోట్లు రాగా ఇది గత ఆర్థిక ఏడాది ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన ప‌రిహారం కంటే 2వేల10 కోట్లు అధికం. మార్చి నెల‌లోనూ 5నుంచి 6వేల కోట్లు రాబ‌డి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్న అధికారులు... ఈ ఆర్థిక ఏడాదిలో వాణిజ్య పన్నుల రాబడులు.. 50వేల కోట్లు దాటుతాయని అంచనావేస్తున్నారు.

ఇదీ చదవండి: 'నీట్' ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.