హుస్సేన్ సాగర్ నాల పరీవాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. ప్రధానంగా అరవింద్ నగర్, సూరజ్ నగర్ వరద నీటిలో చిక్కుకున్న ప్రాంతాల్లో కలెక్టర్ శ్వేతా మహంతి, హిమాయత్ నగర్ మండల తహసీల్దార్ సీహెచ్ లలిత సందర్శించారు. ఇళ్లలోకి వరద నీరు వచ్చిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నాల పరీవాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తూ వారిని సమీపంలోని కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్లకు తరలించాలని సూచించారు. అధికారుల సూచనలు పాటించి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
హుస్సేన్ సాగర్ నాలా పరివాహక ప్రాంతాలైన డీఎస్ నగర్, అరుంధతి నగర్, న్యూ అంబేడ్కర్ నగర్, గుండ్ల బస్తీ, ఓం నగర్ కాలనీ, సబర్మతి నగర్, సూరజ్ నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు వరద నీటిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల నేతలు సందర్శించి... వారికి ఆహారం, పాల ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పద్మ కాలనీ, అజయ్ నగర్, రామ్ నగర్ ప్రధాన రహదారుల్లో రోడ్డుకడ్డంగా చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: యువకుడి విజ్ఞప్తికి స్పందించిన ప్రధాని కార్యాలయం