ETV Bharat / state

కాఫీతో నష్టాలు కూడా ఉన్నాయండోయ్​!

author img

By

Published : Jul 2, 2020, 7:12 PM IST

వేడి వేడి కాఫీ. గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడా లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్​ మహత్యమే. అయితే దీనితో నష్టాలు ఉన్నాయండోయ్​! అవేంటో చూసేద్దాం రండీ.

coffee benefits and losses
కాఫీ మంచీ చెడూ!

కాఫీ తాగని వారంటూ ఉండరు. కానీ ఆ కాఫీలోని కెఫీన్​ అనే పదార్థం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. అయితే దీనితో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. కాఫీతో మూత్రం ఎక్కువగా వస్తుంది. దీనితో ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటిశాతం తగ్గే (డీహైడ్రేషన్​) ప్రమాదముంది. అలాగే ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారూ మితం పాటించడం మంచిది.

కెఫీన్​ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది ఛాతీలో మంట, పులితేన్పుల వంటి సమస్యలకు దారితీయొచ్చు. కెఫీన్​ రక్తపోటు పెరిగేలా చేస్తుంది కాబట్టి హైబీపీ బాధితులు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు. అంతేకాదు.. మనం తిన్న ఆహారంలోని క్యాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్​ అడ్డుతగులుతుందని గుర్తించాలి. కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్​ స్థాయిలు తారస్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం 4-6 గంటల వరకూ కనబడుతుంది! అందువల్ల నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవడం ఉత్తమం.

ఇదీ చూడండి: ఏమైందీ.. ఎమ్మెల్యేకు..? ఒకవైపు ప్రమాదం.. మరోవైపు పొగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.