ETV Bharat / state

Coca Cola Investments in Telangana : మరో భారీ పెట్టుబడి.. తెలంగాణలో పెట్టుబడులను రెట్టింపు చేసిన కోకాకోలా.. - KTR latest news

Coca Cola Investments in Telangana : శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోలా.. తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్​మేక్ గ్రివి.. మంత్రి కేటీఆర్​తో సమావేశమయ్యారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ తన ప్రణాళికలను తెలియజేసింది.

CocaCola Business Expansion in Telangana
CocaCola to Double Investments in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 11:55 AM IST

Updated : Aug 26, 2023, 10:56 PM IST

Coca Cola Investments in Telangana : తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కార్యకలాపాలను విస్తరించేందుకు పెట్టుబడులు పెడుతున్న కోకాకోలా సంస్థ.. తాజాగా అదనపు పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. కోకాకోలా సంస్థ(cocacola in telangana) ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి.. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​తో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన సమావేశంలో ఒప్పందాలను కుదుర్చుకున్నారు. కోకాకోలా సంస్థకు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ భారతదేశం అని.. భారత్​లో తమ కార్యకలాపాలను, వ్యాపారాన్ని మరింతగా విస్తరించే వ్యూహంతో ముందుకు పోతున్నామని జేమ్స్​మేక్ గ్రివి తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు కేటీఆర్​కు​(KTR) తెలియజేశారు.

Coca Cola to Double Investments in Telangana : సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ వద్ద ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణ కోసం గతంలోనే రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించగా.. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో రూ.1,000 కోట్లతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం.. ఏప్రిల్ నెల 22వ తేదీన తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నామని తెలిపారు.

Coca Cola Investments in Telangana : రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సహకారం, ప్లాంట్ల నిర్మాణంలో వేగం, వ్యాపార వృద్దిని దృష్టిలో ఉంచుకొని కోకాకోలా సంస్థ అదనంగా మరో రూ.647 కోట్లను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్​లో పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్లాంట్ డిసెంబర్ 24 వరకు పూర్తి అవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రాష్ట్రంలో తాజాగా రెండో నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా కరీంనగర్ లేదా వరంగల్ ప్రాంతంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్ పెట్టుబడితో కలుపుకుంటే.. తెలంగాణ రాష్ట్రంలో కోకాకోలా సంస్థ దాదాపుగా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుందని సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్​కు తెలిపారు.

Coca Cola New Plant in Telangana : ఈ మధ్యకాలంలో సంస్థ తరఫున అత్యంత తక్కువ కాలంలో వేగంగా విస్తరించిన ప్రాంతంగా తెలంగాణ నిలుస్తుందని.. కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి.. తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ తెలియజేశారు. రాష్ట్రంలో ఒకవైపు ఐటీ, ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాలే కాకుండా.. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ డిఫెన్స్ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. తాజాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ కోకాకోల తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల.. కేటీఆర్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

Mars Group Investments in Telangana : మరో భారీ పెట్టుబడి.. రూ.800 కోట్లతో సంస్థను విస్తరించనున్నట్లు ప్రకటించిన మార్స్ గ్రూప్

Last Updated : Aug 26, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.