CM Revanth Reddy Speech at Nagpur Sabha : దేశంలో ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. మోదీ మెడిసిన్‌కు కాలం చెల్లిందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ బీజేపీ పదే పదే చెబుతోందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే అదానీ, మోదీ అంటూ విమర్శించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ(Congress Foundation Day) కార్యక్రమంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని 150 రోజులు 4000లకు పైగా కిలోమీటర్లు చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) వల్ల అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు వివరించారు. మహారాష్ట్రలో కూడా జరగబోవు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర(Bharat Nyay Yatra)ను మణిపుర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర ముగింపుతో నయా జోష్.. మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు
"దేశంలో ఎర్రకోటపై మూడు రంగుల కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మోదీ మెడిసిన్‌కు కాలం చెల్లింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పదేపదే చెబుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే అదానీ, మోదీ అని అర్థం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఆ యాత్రతోనే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం సాధించాం. ఈసారి మహారాష్ట్రలో కూడా అధికారాన్ని దక్కించుకోనున్నాము." - రేవంత్ రెడ్డి, సీఎం
Congress Foundation Day Celebrations 2023 : ఈసారి ఎర్రకోట(Red Fort)పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతి మెడిసిన్‌కు ఒక ఎక్స్‌ఫైరీ తేదీ ఉంటుందని అలాగే నరేంద్రమోదీ అనే మెడిసిన్‌కు కూడా ఎక్స్‌ఫైరీ తేదీ అయింపోయిందన్నారు. రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదని చెప్పారు.
CM Revanth Reddy Fires PM Modi : లోక్‌సభలో రాహుల్ గొంతు విప్పడంతో అదానీ ఇంజిన్ ఆగిపోయి షెడ్‌కు పోయిందని ఆరోపించారు. ఇప్పుడు భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజిన్ ఆగిపోయి, షెడ్డుకు పంపడం ఖాయమని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులంతా వందరోజులు పాటు దేశం కోసం, కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
'అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన'- ''ఇండియా' ఐక్యతతో బీజేపీ కనుమరుగు'
'అప్పటిలోగా నేమ్ప్లేట్లు మార్చుకోండి'- కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు- ఆస్తుల ధ్వంసంపై డీకే ఫైర్