ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ సందడి - ప్రముఖులకు నేతల శుభాకాంక్షలు - CM Revanth meets Governor

CM Revanth Reddy Meets Governor Tamilisai Today : నూతన సంవత్సర వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. కొత్త ఏడాదిని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులకు ముఖ్యమంత్రి, స్పీకర్‌ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది కొత్త పాలన సజావుగా సాగాలని కాంక్షించారు.

CM Revanth met Governor Tamilisai
CM Revanth met Governor Tamilisai
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 1:29 PM IST

Updated : Jan 1, 2024, 8:15 PM IST

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Meets Governor Tamilisai Today : నూతన సంవత్సర వేడుకల వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లో రేవంత్ రెడ్డి గవర్నర్‌ని కలిసిన అనంతరం గవర్నర్ దంపతులకు శాలువాకప్పి సత్కరించారు. పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రులు సీతక్క, కొండా సురేఖ గవర్నర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 2024వ ఏడాదికి స్వాగతం పలుకుతూ గవర్నర్ చేపట్టిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు గవర్నర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

కొత్త ఏడాది కొంగొత్త నిర్ణయాలు - నూతన లక్ష్యాలతో ముందుకు వెళ్తామంటున్న యువత

CM Revanth Reddy New Year Wishes 2024 : న్యూఇయర్​ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) సీఎంకు పూలమెుక్కను అందించి అభినందించారు. కొత్త ఏడాది వేళ ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్క రేవంత్ రెడ్డితో పాటు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి శుభాకాంక్షలు(New Year Wishes 2024) తెలిపారు.

CM Revanth Reddy Wishes New Year 2024 : ముఖ్యమంత్రి రేవంత్‌కు మంత్రి సీతక్క ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహుకరించారు. వీరితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు, ఐపీఎస్​ అధికారులు సైతం ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను 'రైతు-మహిళ- యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని చెప్పారు. ప్రజల గోడు వినేందుకు ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోందని పేర్కొన్నారు.

న్యూ ఇయర్​ వాట్సాప్​ స్టేటస్ ​- ఈ కోట్స్ ట్రై చేశారంటే సూపర్​ అనాల్సిందే!

Officials New Year Wishes to CS Santhi Kumari : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్​ అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతును కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కలెక్టర్‌ సూచనతో వేడుకలకు వచ్చిన అధికారులు, సిబ్బంది, పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు వసతి గృహ విద్యార్థులకు అందించారు.

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ

న్యూ ఇయర్​ వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి పొన్నం ప్రభాకర్​

Last Updated : Jan 1, 2024, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.