అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నర్సుల సేవలు, త్యాగం మరువలేనివని కేసీఆర్ పేర్కొన్నారు. రోగులను ఎంతో సహనంతో, తల్లిలా చూసుకుంటారని వెల్లడించారు. కరోనా రోగులను కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారని తెలిపారు. నేటి విపత్కర పరిస్థితుల్లో నర్సుల రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్