ETV Bharat / state

ఈనెలలోనే నూతన కలెక్టరేట్లు ప్రారంభం: మంత్రి వేముల - తెలంగాణలో నూతన కలెక్టరేట్ల నిర్మాణ వార్తలు

నిర్మాణం పూర్తయిన ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్లను సీఎం కేసీఆర్​ ప్రారంభిస్తారని రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి తెలిపారు. నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించిన మంత్రి.. ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

minister prasanth reddy review
ఈనెలలోనే నూతన కలెక్టరేట్లు ప్రారంభం: మంత్రి వేముల
author img

By

Published : Jan 3, 2021, 11:46 AM IST

నిర్మాణం పూర్తయిన కలెక్టరేట్లను ఈనెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రుల క్వార్టర్స్​లోని తన అధికారిక నివాసంలో పాలనాధికారి కార్యాలయాల నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పరిపాలనను సులభతరం చేయాలనే సీఎం ఆలోచనతోనే నూతన జిల్లాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందకి తెచ్చేలా నూతన కలెక్టరేట్ భవన సముదాయాలు ఉండనున్నాయన్నారు.

ఈనెల మొదటి వారంలో సిద్దిపేట, నిజామాబాద్, రెండో వారంలో కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మూడో వారంలో వరంగల్, జనగాం, పెద్దపల్లి, నాలుగో వారంలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నూతన కలెక్టరేట్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో నిర్మాణాలు తుదిదశలో ఉన్న కలెక్టరేట్ల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వనపర్తి, మహబూబాబాద్, మెదక్, నాగర్​కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని క్షేతస్థాయిలో పర్యవేక్షించాలని ఈఎన్సీ గణపతిరెడ్డిని మంత్రి ఆదేశించారు.

ఇవీచూడండి: అదొక ప్రత్యేక ప్రపంచం... ఆధునిక ‘బృందా’వనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.