ETV Bharat / state

విమానం కొంటున్న కేసీఆర్.. ధర ఎంతో తెలుసా?

CM KCR buy New Plane: కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో తెరాస కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటనకోసం చిన్న విమానం కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. విమానం కొనుగోలుకు దసరా రోజు ఆర్డర్‌ ఇచ్చే యోచనలో తెరాస ఉంది.

CM KCR will buy a plane for national politics with 80 crore rupees
విమానం కొంటున్న కేసీఆర్.. ధర ఎంతో తెలుసా?
author img

By

Published : Sep 30, 2022, 7:26 AM IST

CM KCR buy New Plane: జాతీయ పార్టీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెరాస గురువారం ఓకీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చిన్న విమానం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 80 కోట్లు వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. 12 సీట్లతో కూడిన ఆవిమానం కొనుగోలుకు దసరారోజు ఆర్డర్‌ ఇవ్వాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.

దసరారోజు కొత్త పార్టీపేరు ప్రకటన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. తెరాస ఖజానాలో ఇప్పటికే 865 కోట్ల మేర నిధులున్న విమానం కొనుగోలుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల పర్యటనలకు ప్రైవేటు విమానాలు అద్దెకు తీసుకొని వినియోగిస్తున్నారు.

జాతీయ పార్టీ ఏర్పాటు దృష్ట్యా సొంతవిమానం అవసరమనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. 2001లో తెరాసను ప్రారంభించాక హెలికాప్టర్‌ను వినియోగించడంతో పార్టీ బలోపేతానికి దోహదం చేసిందని.. తద్వారా గుర్తింపు వచ్చిందని.. ఇప్పుడు సొంతవిమానం వాడడం ద్వారా జాతీయస్థాయిలో అంతే గుర్తింపు వస్తుందని కేసీఆర్‌ పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.