ETV Bharat / state

నేడు మహారాష్ట్రలో BRS భారీ బహిరంగ సభ.. CM KCR ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..!

BRS Public Meeting in Maharashtra Today : బీఆర్​ఎస్​ పార్టీ నేడు మహారాష్ట్రలో మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. లోహాలో జరిగే ఈ బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి లోహాకు కేసీఆర్‌ బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణకు బీఆర్​ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

BRS Public Meeting
BRS Public Meeting
author img

By

Published : Mar 26, 2023, 8:01 AM IST

BRS Public Meeting in Maharashtra Today : మహారాష్ట్రలోని లోహా నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి.. నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్​ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో నేడు రెండోసారి సభ నిర్వహిస్తోంది. ప్రవాస తెలంగాణ వాసులు అధికంగా ఉన్న నాందేడ్‌లో ఏర్పాటు చేసిన ఈ సభకు.. జనం అధిక సంఖ్యలో హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశాయి. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్న ఈ సభతో.. మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా బీఆర్​ఎస్ అడుగులు వేస్తోంది.

బీఆర్​ఎస్​ను అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వివిధ రాష్ట్రాల్లోని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. దాంట్లో భాగంగానే మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీల నాయకులతో పాటు ఛత్రపతి శివాజీ వారసులైన నేతలు సైతం ముందుకొచ్చారు. తెలంగాణను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును కోరుతున్నారు. వాటన్నింటిని పరిగణనలోనికి తీసుకొని సీఎం కేసీఆర్‌ మొదట మహారాష్ట్రలో తమ పార్టీ కార్యక్రమాల విస్తరణకు నిర్ణయించారు.

దాంట్లో భాగంగానే ఫిబ్రవరి 5న నాందేడ్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మొదటి బహిరంగ సభకు మంచి స్పందన రావడంతో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయించారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉన్న నాందేడ్‌తో పాటు ఠాణె, అహ్మద్‌నగర్‌, శిర్డీ, బ్రుహన్‌ముంబై లాంటి కార్పొరేషన్లలో పోటీకి సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో బీఆర్​ఎస్.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో తన అనుచరులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ వద్ద సభ నిర్వహించాలని కోరారు లోహా మాజీ ఎమ్మెల్యే, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) కిసాన్‌ సెల్‌ నేత శంకర్‌గణేశ్‌రావు ధోంగె. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు బీఆర్​ఎస్ నేతలు 10 రోజులుగా అక్కడే ఉండి నేడు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.

సీఎం కేసీఆర్‌ ప్రసంగంపై ఉత్కంఠ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి మహారాష్ట్రలోని లోహాకు చేరుకుంటారు. 3 గంటలకు స్థానిక నేతలతో సమావేశమై.. అనంతరం 4 గంటలకు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ సభలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరతారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండు దఫాలుగా విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. అదేవిధంగా తాజాగా కేంద్రం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడంపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ ప్రసంగం ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌పై బీఆర్​ఎస్​ వైఖరిని కూడా వెల్లడించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.