ETV Bharat / state

ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్​కు చీకటి ఒప్పందం: సంపత్​ - మాజీ ఎమ్మెల్యే సంపత్​ కుమార్​ తాజా వార్తలు

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. ఆర్డీఎస్​పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మాణాలు చేపడుతుందని.. సంగమేశ్వరం నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన కేసీఆర్ సర్కార్ చోద్యం చూస్తోందని మండిపడ్డారు.

sampath kumar
సంపత్ కుమార్
author img

By

Published : Mar 26, 2021, 5:47 PM IST

సీఎం కేసీఆర్​కు ఎన్నికలు, ఓట్లు, సీట్లపైనే దృష్టి తప్పితే రాష్ట్ర నీటి వాటాలను దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్​పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మాణాలు చేపడుతుందని.. సంగమేశ్వరం నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన కేసీఆర్ సర్కార్ చోద్యం చూస్తోందని మండిపడ్డారు.

జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఏమీ చేయలేని దద్దమ్మలని విమర్శించారు. అలంపూర్ నియోజకవర్గంలో సాగునీటికి, తాగునీటి ఇబ్బంది నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్​పై ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వరం పనులపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తే పట్టించుకోలేదని.. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్​కు చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు.

ఇప్పటికైనా కేసీఆర్ ఏపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను ఆపాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో తమ నీటి వాటాలను కాపాడుకునేందుకు యుద్ధానికి సిద్ధమన్నారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలో మీడియాను రోడ్డుపైకి నెట్టడం మంచిది కాదన్న ఆయన.. దేశంలో ఎక్కడా మీడియాపై ఇలాంటి ఆక్షలు లేవని తెలిపారు.

ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.