రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ అజిత్‌సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ వారసత్వాన్ని ఆయన సమర్థంగా కొనసాగించారని గుర్తు చేశారు. రైతు నేతగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు అజిత్ సింగ్ మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలు మరువలేనివని అన్నారు.
కరోనా బారిన పడ్డ అజిత్ సింగ్ గురువారం ప్రాణాలు కోల్పోయారు. అజిత్ మరణాన్ని ఆయన తనయుడు జయంత్ చౌదరీ ధ్రువీకరించారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్. 1939 ఫిబ్రవరి 12న ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో జన్మించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన చౌదరి అజిత్ సింగ్.. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. యూపీఏ హయాంలో పౌరవిమానాయానశాఖ మంత్రిగా సేవలందించారు.
ఇదీ చూడండి: కరోనాతో ఆర్ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్ మృతి