ETV Bharat / state

రాష్ట్రంలోని భూలావాదేవీల్లో నేటితో సరికొత్త అంకం - ఇవాళ ప్రారంభం కానున్న ధరణి పోర్టల్​

రాష్ట్రంలోని భూలావాదేవీల్లో ఇవాళ్టి నుంచి సరికొత్త అంకం ప్రారంభం కానుంది. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో పాటు మ్యుటేషన్లు ఏకకాలంలో జరగనున్నాయి. కోటీ 55 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేశారు. ఇక నుంచి పోర్టల్ ద్వారానే భూక్రయవిక్రయాలు జరగనున్నాయి. అవకతవకలకు ఆస్కారం లేని.. పూర్తి పారదర్శక విధానంలో సేవలందేలా రూపొందించిన ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు ప్రారంభించనున్నారు.

cm kcr to launch dharani portal today
రాష్ట్రంలోని భూలావాదేవీల్లో నేటితో సరికొత్త అంకం
author img

By

Published : Oct 29, 2020, 5:08 AM IST

రాష్ట్రంలోని భూలావాదేవీల్లో నేటితో సరికొత్త అంకం

భూలావాదేవీల్లో అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శక విధానంలో క్రయవిక్రయాలు జరగాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష.. నేటితో నెరవేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్ ఇవాళ ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020 నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం కేసీఆర్... రైతులతోనూ మాట్లాడతారు. ధరణి పోర్టల్ ప్రారంభంతో రాష్ట్రవ్యాప్తంగా 570 తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

అధికారుల విచక్షణాధికారాలు తొలగింపు

రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతిని అరికట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం... వ్యవసాయ భూముల వివరాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించి రికార్డులను డిజిటలైజ్ చేసింది. తహసీల్దార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే అధికారులకు ఉన్న విచక్షణాధికారాలు, ఇతరత్రా లోపాల వల్ల రెవెన్యూ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు.. సర్కారు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని సంకల్పించింది. అందుకు అనుగుణంగా తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020ని తీసుకొచ్చింది. దీని ప్రకారం భూలావాదేవిలన్ని ఇకపై ధరణి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే జరగనున్నాయి.

రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకే చోట..

కొత్త చట్టంలో అధికారులకు ఎలాంటి విచక్షణాధికారాలు లేకుండా నిబంధనలను పొందుపరిచారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపడతారు. ఇందుకోసం తహసీల్దార్లను సంయుక్త సబ్‌రిజిస్ట్రార్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల్లో తహసీల్దార్లు లేని పక్షంలో నాయబ్‌ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. గతంలో లాగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు వేర్వేరు చోట కాకుండా ఒకేచోట జరిగేలా చట్టసవరణ చేశారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకే కార్యాలయంలో ఏకకాలంలో జరుగుతాయి. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల వివరాలన్నింటినీ ఆర్వోఆర్​, పహాణీలతో పాటు ధరణి పోర్టల్‌లో పొందుపరిచారు. సర్వే నంబర్ల వారీగా భూముల మార్కెట్ విలువను కూడా పొందుపరిచారు. ఇకపై ధరణి ద్వారానే భూముల క్రయవిక్రయాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. దస్త్రాలను కూడా ధరణి ద్వారానే తయారు చేసుకోనే వీలు కల్పించారు. కేవలం అరగంటలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.

570 తహసీల్దార్ కార్యాలయాల్లో..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 570 గ్రామీణ ప్రాంత తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు తహసీల్దార్లకు శిక్షణ కూడా ఇచ్చారు. అటు వ్యవసాయేతర ఆస్తులను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీవర్షాల కారణంగా నమోదు ప్రక్రియకు ఆటంకం కలిగింది. వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు కూడా ధరణి ద్వారానే జరగాల్సి ఉంటుంది.

ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలకు పోలీస్​ అధికారుల కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.