CM KCR Meeting: తెరాస ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సంయుక్త సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు పాల్గొననున్నారు.
ఈనెల 19న వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కలెక్టర్ కార్యాలయంతోపాటు మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటనకు నాలుగు రోజులే ఉండగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తమిళనాడు పర్యటన...
ముఖ్యమంత్రి కేసీఆర్... తమిళనాడులో పర్యటించారు. రెండు రోజుల టూర్లో ఆయన... మొదట కుటుంబంతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి... రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు జిల్లా కలెక్టర్ శివరాసు, ఆలయాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రికి.. పుజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. రెండో రోజు సాయంత్రం చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. జాతీయస్థాయి అంశాల గురించి చర్చించారు. పర్యటన అనంతరం, కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఇదీ చూడండి: KCR Visited Srirangam Ranganathaswamy: శ్రీరంగం రంగనాథస్వామి సేవలో సీఎం కేసీఆర్