హైదరాబాద్ లోపల, బయట లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమి ఉందని వీటిలో విరివిగా చెట్లు పెంచి దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా, కాలుష్యం పెరగకుండా చూడవచ్చన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ బడ్జెట్లలో పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలన్నారు. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా హరిత ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచిచారు.
అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకొకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలోని అన్ని పట్టణాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా పట్టణ ప్రగతిలో చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు.
ఇవీ చూడండి: అనతికాలంలోనే రాష్ట్రంలో అత్యున్నత ఫలితాలు: తమిళిసై