ETV Bharat / state

'ఆ రంగంలోనూ పురోగతి సాధించాలి.. దేశానికే ఆదర్శం కావాలి'

CM KCR speech: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో బెంచ్‌ల పెంపుపై ఆనందం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. అందుకు అనుగుణంగా సిబ్బంది కూడా కావాలన్నారు.

'ఆ రంగంలోనూ పురోగతి సాధించాలి.. దేశానికే ఆదర్శం కావాలి'
'ఆ రంగంలోనూ పురోగతి సాధించాలి.. దేశానికే ఆదర్శం కావాలి'
author img

By

Published : Apr 16, 2022, 5:00 AM IST

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించినట్లే న్యాయ పరిపాలన రంగంలోనూ పురోగతి సాధించి దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయవ్యవస్థకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల 780 పైచిలుకు పోస్టులు మంజూరు చేశామని, హైకోర్టు బెంచీలు పెరిగినందున సీజే అభ్యర్థన మేరకు 885 అదనపు పోస్టులు మంజూరు చేశామన్నారు. కొత్త జిల్లాల్లోని కోర్టుల కోసం 1730 పోస్టులు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక మొత్తం 4348 పోస్టులను మంజూరు చేసినట్లు చెప్పారు. పాత, కొత్త జిల్లాల్లో కోర్టులు ఏర్పాటు చేయాలని సీజేకి విజ్ఞప్తి చేశామన్నారు. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలకు కలెక్టర్లు స్థలాలను గుర్తించిన వెంటనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. నాంపల్లి పక్కన ఉన్న ఉద్యానశాఖ స్థలాన్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించామని, దీన్ని కోర్టుకు అప్పగిస్తామన్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో పనిభారం ఉందని తెలిసిందని, ఈ కోర్టుల్లో జడ్జీల సంఖ్యను పెంచాలని సీజేకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన తరువాత బెంచీల సంఖ్యను పెంచాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదని, జస్టిస్‌ రమణ ప్రధాన న్యాయమూర్తి అయ్యాక చొరవ తీసుకుని 24 నుంచి 42కు పెంచారని, ఇందుకు ప్రజల తరఫున నమస్సులు తెలుపుతున్నానన్నారు. న్యాయమూర్తుల హోదాకు తగ్గట్టుగా వసతి సౌకర్యం కల్పిస్తామని, 42 మందీ ఒకేచోట ఉండేలా 30 నుంచి 40 ఎకరాల్లో నివాస భవనాలు నిర్మిస్తామన్నారు. దుర్గంచెరువు ప్రాంతంలో భూమిని గుర్తిస్తున్నామని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను ఆహ్వానించి పునాది వేయిస్తామని, దీనికి ఆయన అంగీకరించాలని కోరారు.

కోర్టులపై నమ్మకంతో రెవెన్యూ కోర్టుల రద్దు
కోర్టులపై ఉన్న విశ్వాసంతో రెవెన్యూ కోర్టులను రద్దు చేసి అక్కడి కేసులను కోర్టులకు బదిలీ చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రెవెన్యూ రికార్డులు సహా 1.52 కోట్ల ఎకరాల భూమి వివరాలను డిజిటలైజేషన్‌ చేశామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీ అనివార్యమవుతోందని, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలతో మాట్లాడితే జ్యుడిషియరీ గురించి అడుగుతున్నారని, కేసులు తేలడానికి ఎన్నేళ్లు పడుతుందంటున్నారన్నారు. జడ్జీలందరూ ఇక్కడే ఉన్నందున విచారణలు సత్వరం పూర్తవుతుంటే, పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 400 మంది జడ్జీలతో జరుగుతున్న ఈ సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి..

'సామాన్యుడికి న్యాయం చేకూరాలంటే ఈ రెండు విషయాలు చాలా కీలకం'

ఒకే కొమ్మకు 1,269 టమాటాలు- పదేళ్ల గిన్నిస్ రికార్డ్​ బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.